Tuesday, 24 March 2015
Tuesday, 13 August 2013
Sunday, 24 March 2013
Tuesday, 29 January 2013
rally grand success in cihttoor
చిత్తూరులో సమైక్యనినాదం హోరెత్తింది. ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో
మంగళవారం నిర్వహించిన ర్యాలీలో సమైక్యవాదులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, విద్యార్థులతో పాటు అన్నివర్గాల ప్రజలు
ర్యాలీలో పాల్గొన్ని సమైక్యనినాదాన్ని వినిపించారు. సీకే బాబు కార్యాలయం
నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది.
Monday, 28 January 2013
Monday, 3 September 2012
వై.ఎస్ వర్దంతి సభ :మనసు విప్పిన సి.కె
ఈ రోజు డా.వై.ఎస్ వర్దంతి సభలో చిత్తూరు ఎం.ఎల్.ఏ సి.కె బాబు మనసు విప్పి మాట్లాడారు. సి.కె అంటేనే సంచలనం. వై.ఎస్ మరణానంతరం చిత్తూరులో జరిగిన రెండు వర్దంతి సభల్లోను పాల్గొనక రాజదానికే పరిమితమైన సి.కె ఈ రోజు 3 వ వర్దంతి సభలో మాత్రం పాల్గొనడం విశేషం.
మరీ శనివారమే విజయమ్మ -జగన్ ఫ్లెక్సిలు ఏర్పాటు చేసిన వాహనంలో
సి.కె అభిమానులు ఊరంతా తిరిగి వర్దంతి సభను జయప్రదం చెయ్యాలని ప్రజలకు విజ్నప్తి చెయ్యడం పెద్ద సంచలనం సృష్ఠించింది.
దీంతో సి.కె ఇడుపులపాయ భయలు దేరుతున్నారని – విజయమ్మ సమక్షంలో జగన్ పార్టి తీర్థం పుచ్చుకుంటారని పుకార్లు షికార్లు చేసాయి.
స్థానిక కట్టమంచిలో స్వయంగా సి.కె నిర్మించిన షిర్డి సాయి మందిరం వద్దనుండి ర్యేలి బయలు దేరింది. సె.కె స్వయాన ఎన్ఫీల్ద్ బుల్లెట్ పై ర్యాలిలో పాల్గొనడం విశేషం.
రెడ్డిగుంట చెక్ పోస్టు కూడలిలో ఇది వరకే తాము ( సి.కె ) ఏర్పాటు చేసిన డా.వై.ఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సి.కె మైకు చేత పట్టి తమ ప్రసంగం మొదలు పెట్టారు.
డా.వై.ఎస్ తో తమకున్న ఆత్మీయతను ప్రజలతో పంచుకున్నారు. తమకు అక్కా చెల్లెళ్ళు -భంధువులంటూ ఎవరూ లేరని -ఉన్నవారంతా దూరమయ్యారని ప్రజలే తమ భంధువులన్నారు.
వై.ఎస్ ప్రజలకు చేసిన మంచి పనులను అందరూ చెప్పుకోవాలన్నారు.పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వై.ఎస్ను స్మరించుకోవాలన్నారు.వై.ఎస్. కుటుంబానికి బాసటగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు
ఎందరు ముఖ్యమంత్రులొచ్చినా ఎవరూ చిత్తూరును పట్టించుకున్న పాపాన పోలేదని ఒక్క వై.ఎస్ ఆర్ చొరవతోనే చిత్తూరు జిల్లా అభివృద్ది చెందిందన్నారు
ఇక వర్దంతి సభ ఏర్పాటు తమ వ్యక్తిగతమని . తనను ఎవరూ నియంత్రించలేరని -తమ చిటికిన వ్రేలును సైతం కదిలించలేరన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎంతో చొరవ చూపుతూ చక్రం తిప్పిన సి.కె సతీమణి లావణ్య డాక్టరేట్ కోసం వై.ఎస్.పరిపాలన పై రిసెర్చ్ చేస్తున్నారన్నది కొసమెరపు.
Source: http://sambargaadu.wordpress.com/2012/09/02/ysr-dimise/

Saturday, 21 April 2012
Thursday, 5 April 2012
Subscribe to:
Posts (Atom)