Thursday 31 December 2009

Monday 21 December 2009

జగన్ నేతృత్వంలో కొత్త పార్టి


జగన్ నేతృత్వంలో కొత్తపార్టి ఏర్పాటు కావటం ఖాయమనిపిస్తూంది. ఈ నెల 9 వ తేదినుండి సమైక్యాంథ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా ఇంత వరకు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడ రోశయ్య అనర్హుడని చెప్పలేదు. కాని ఈ రోజు సి.కె.ఆద్వర్యంలో పురపాలక చేర్మన్ గా ఉన్న సరళా మాఏరి (ఇది వరకే రాజినామా సమర్పించారు) , చిత్తూరు పట్టణ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శివప్రసాద్ "రోశయ్య అనర్హుడని వెంటనే అతను రాజినామా చెయ్యాలని డిమాండ్ చేసేరు

వై.ఎస్. ప్రియ శిష్యులు చిత్తూరు ఎం.ఎల్ ఏ సి.కె.బాబు కనుసైగలు లేక ఇట్టి స్టేట్మెంట్ భయిటకొచ్చే అవకాశమే లేదు. అలాగే ఇన్ని రోజులు రాజదానికే పరిమితమై ఉన్న సి.కె బాబు ఈ తిరుపతికి చేరుకోవడం నిరాహారా దీక్షలో పాల్గొనడం 24+24 గంటల రాయలసీమ బంధ్కు పిలుపునివ్వడం కూడ కొత్త పార్టి ఆవిర్భావానికి సూచికలే.

నాడు వై.ఎస్. నేడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న సి.కె. స్వతాహగా ఈ నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదు.

కడపలో వివేకానంద రెడ్డి దీక్షను బగ్నం చెయ్యడం, పార్లెమెంటులో జగన్ మోహన్ రెడ్డి నమస్కరిస్తే కనీశం ఒక చిరునవ్వన్నా చిందించక సోనియా తల బిరుసుతో వెళ్ళీ పోవడంవంటి సంఘఠనలు ఎన్నో ఈ నిర్ణయం వెనుక దాగి ఉన్నాయి

అసలు కడప ఎం.ఎల్.ఏ టిక్కెట్ జగనుకు ఇవ్వక పోవడమే అసలైన మనస్పర్దలకు దారి తీసిందనిపిస్తుంది. సతరు బి.ఫామును కె.వి.పి పి.ఏ తీసుకోవడం, వై.ఎస్. సతీమణి పదవీ స్వీకారం చెయ్యక పోవడం, సభకు రాక పోవడం, ఏకగ్రీవ ఎంపికకు సహకరించిన ప్రతి పక్షాలకు కనీశం కృతజ్ఞతలు చెప్పక పోవడం వెనుక కూడ ఎన్నో వ్యూహాలు దాగి ఉన్నాయి.
ఎటు లెక్కించినా జగన్ కొత్త పార్టి పెట్టడం ఖాయమనే చెప్పాలి

congress (YS)
3753253313

సంఖ్యా శాస్త్ర ప్రకారం లెక్కిస్తే ఈ పేరుతో పార్టి పెడితే ( టోటల్ 35 దానిని కూడి సింగిల్ నెంబరు చేస్తే 8 వస్తాయి) కేవలం 8 నెలల శ్రమతో ఈ పార్టి అధికారానికి వచ్చే అవకాశాలున్నాయి.
అయితే ఈ పేరుతో అనే అక్షరాన్ని మాత్రం కలపకూడదు. అలా కలిపితే టోటల్ పది వస్తుంది. చివర సున్న రావడం చేత ఆ పార్టి కేవలం ఒక ప్రాంతానికే పరిమితమై పోయే అవకాశం ఉంది తస్మాన్ జాగ్రత్తా


http://sambargaadu.blogspot.com/2009/12/blog-post_20.html

rajiv gandhi antae abhimanam

police force

interview

ఆమరణ దీక్ష-- మొదటి రోజు

x

Sunday 20 December 2009

తిరుపతి లో సి.కే.బాబు ఆమరణ నిరాహార దీక్ష


చిత్తూర్ ఎం.ఎల్.ఎ సి.కే.బాబు గారు తిరుపతి లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ..... కరుణాకర్ రెడ్డి మరియు చాల మంది కాంగ్రెస్ కార్య కర్తలు ఆయనకు మదతు తెలిపారు....

అయన ఇంత వరకు నలుగు సార్లు ఎన్నికయ్యారు ................

సి.కే.బాబు గారు చేసే దీక్ష తో చిత్తూర్ లో అభిమానులలో ఉత్సాహం పెరిగింది.

సోమవారం మరియు మంగళవారం చిత్తూర్ లో బంద్ కు పిలుపు నిచారు....

ఇపటికే వై.ఎస్ అభిమానులు మరియు శిష్యులు ఐన చాల మంది ఇలాంటి దీక్షలకు పునుకునారు.......

జై సి.కే
వై.ఎస్.ఆర్ అమర్ రహే...............

సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం

ఇటీవల హేట్రిక్ ఎ౦.ఎల్.ఎ. , చిత్తూరు టైగర్, ప్రజా నాయకులు సి.కె.బాబు గారి అభిమానులు కొందరు 2007,డెసెంబర్ ,31 న సి.కె.పై జరిగిన బ్లాస్ట్ నేపథ్యంలో నాలుగు ముక్కలు వ్రాయమన్నారు . అందులో దగ్గర పడుతూంది మా నాయకుడు కిరీటం దరించే రోజని ఒక ముక్క తమిళ వెర్షన్ లో వచ్చి పడింది . అది వ్రాసిన దినం డిసెంబర్ 30. జనవరి 1 సాయంత్రమే సి.కె.బాబుకు రాయలసీమ అభివౄద్ది మండలి చేర్మన్ పోస్టు ఖాయమైనట్లు వార్తా పత్రికల్లో కథనాలు వెలుబడ్డాయి ను రాయల సీమ అభ్వృద్ది మండలి చేర్మన్ పదవి వరించనుంది. ఈ సంచిక వెలుబడే లోపె ఉత్తర్వులు జారి అయ్యుండవచ్చు.

సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం

నాకు సంవత్సరం సరిగ్గా గుర్తులేదు కాని చిరంజీవి నటించిన చానక్య శపథం సినిమా రిలీజైన రోజది.
చిరంజీవి అభిమానులంతా ఒక గ్రూపైతే, అభిమానుల్లో నలుగురం ఒక గ్రూపుగా ఏర్పడినాం. అప్పట్లో మా బాస్ స్వ//ఎన్.ఆర్.రఘు
(చిత్తూరులో పసుపు చొక్కా వేసుకుని ,తిరిగిన మొట్ట మొదటి వ్యక్తి. కాని ఒక కులం వారు అతనిని ప్రక్కన పెడుతూ కవున్సిలర్ పదవికే పరిమితం చేసేరు. కాని సి.కె. అతన్ని పిలిచి మరి ఎం.పి.పి.గా పోటి చేయమని అవకాశం కల్పించారు. అప్పటికే అతను ఔట్ డేటడ్ అయ్యుండడం, సినిక్ గా తయారు కావడం చేత ఓడిపోయాడు)
ఆయన ఆద్వర్యంలో మేము చానక్య శపథం ఫ్యావరిట్ షోకు ప్లాన్ చేసాం . తిక్కెట్లు ముద్రించుకొని విక్రయం కూడ మొదలు పెట్టేసాం. అప్పుడు సి.కె. మునిసిపల్ వైస్.చేర్మన్ గా ఉన్నారు.
తక్కిన అభిమానులంతా సి.కె.వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన అనుకుని ఉంటే షోను మెజారిటి గ్రూపు అభిమానులకు దక్కేలా చేసి ఉండవచ్చు. ఇందాకా అమ్మిన టికెట్ల డబ్బులను సైతం రాభట్టి అసలైన అభిమానులకు ఇచ్చి ఉండవచ్చును.
కాని ఆయన మా అందరిని ఒప్పించి ఇందాకా అమ్మిన టిక్కెట్ల సొమ్ము త్యేతర్ అలంకారానికి మేమే వెచ్చించేట్లు, తక్కిన టికెట్లను అసలు cost కే కౌంటర్ లో అమ్మేలా ఏర్పాటు చేసారు.
ఈ ఒక్క సంఘఠన చాలు ఆయన ఔన్నత్యాన్ని చాటదానికి.

ఇంకో చిన్న విషయం చెబుతా చిత్తూరు తౌన్ తేన బండ అవతల మంగ సముద్రం ఉంది. ఆ సర్పంచ్ తె.దే.పా కు చెందినవారు. అక్కద మురావత్ ఆలిషా బాబా దర్గా ఉంది. చిత్తూరు ఎం.పి.ఆదికేఆవులు మంగసముద్రానికి ఒక త్రాగునీటి బోరు ఒకటి మంజూరు చేసారు.(ఎం.పి.నిదుల్లో నుండి) బోరు పాయింట్ దర్గా ఆవరనలో పడింది. దర్గా వారు బొరు వేసుకోవడానికి అనుమతించారు. పది మంది ఉపయోగపడే పని కాబట్టి. బోరు వేసారు. మోతారు బిగించారు. ఓపనింగ్ తేది దగ్గర పడింది. సర్పంచ్ దర్గా కమిటి వారివద్దకు వచ్చి ప్రస్తుతానికి దర్గా కరెంటుతో ఓపనింగ్ మాత్రం చేస్తాం. ఆతరువాత లైన్ వచ్చేస్తుందన్నారు. దర్గా వారు అందుకూ సమ్మతింఛేరు.
ఇక చూసుకొండి రోజులు నెలలయ్యై,నెలలు సంవత్సరాలయ్యాయి. లైను రాలే ,ఇంకోటి రాలే.. విదుయుత్తేమో దర్గా వారిది. బిల్లేమో వేలల్లో వస్తుంది. పేరేమో సర్పంచికి,ఎం.పి.కి. పోని బిల్లు కట్టడం మానేస్తే డిపార్ట్మెంటు వారు ఫ్యూజు పీకుతారు. అయినా సంవత్సారాలు తరబడి బిల్లులు కట్టేరు. ఆపై దర్గా వారు సి.కె.కు విన్నవించేరు. సి.కె. సతరు సర్పంచికి చెప్పేరు . చెప్పినప్పుడల్లా అతివినయం ప్రదర్శించతం. తీరా ఆ మాటలను గాలికొదిలేయడం . ఇదీ వరసా. సి.కె. ఆ సర్పంచిని తన్న లేదే.బెదిరించ లేదే. ఈ సమస్య ఆ నోట ఈ నోటా ప్రాకి నా చెవికి వస్తే నాదైన శైలిలో ఈ సమస్యను పరిష్కరించాను. ఇందుకు క్రుతజ్ఞతలు తెలుపడానికి దర్గా కమిటి వారు నాకు సాలువ కప్పడానికి సిద్దమయ్యేరు. కొందరు అత్యుత్సాహం తో ఈ సంగతి సి.కె.చెవికి చేర్చారు., ఆయన ఏ మాత్రం ఈగో ఫీల్ కాలేదే. దర్గా కమిటీ వారు నాకు సాలువ కప్పేరు. ఆ ఫొటో పత్రికల్లో సైతం వచ్చాయి.
ఆత్మ విశ్వాసం గలవాడు ఎప్పుడూ ఈర్ష్య ఫీల్ కాడు. సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం గురించి చెప్పాలంటే ఇంకా 10 బ్లాగులు పెట్టాలి సుమా !

సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం


ఇటీవల హేట్రిక్ ఎ౦.ఎల్.. , చిత్తూరు టైగర్, ప్రజా నాయకులు సి.కె.బాబు గారి అభిమానులు కొందరు 2007,డెసెంబర్ ,31 సి.కె.పై జరిగిన బ్లాస్ట్ నేపథ్యంలో నాలుగు ముక్కలు వ్రాయమన్నారు . అందులో దగ్గర పడుతూంది మా నాయకుడు కిరీటం దరించే రోజని ఒక ముక్క తమిళ వెర్షన్ లో వచ్చి పడింది . అది వ్రాసిన దినం డిసెంబర్ 30. జనవరి 1 సాయంత్రమే సి.కె.బాబుకు రాయలసీమ అభివౄద్ది మండలి చేర్మన్ పోస్టు ఖాయమైనట్లు వార్తా పత్రికల్లో కథనాలు వెలుబడ్డాయి ను రాయల సీమ అభ్వృద్ది మండలి చేర్మన్ పదవి వరించనుంది. సంచిక వెలుబడే లోపె ఉత్తర్వులు జారి అయ్యుండవచ్చు.

సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం

నాకు సంవత్సరం సరిగ్గా గుర్తులేదు కాని చిరంజీవి నటించిన చానక్య శపథం సినిమా రిలీజైన రోజది.
చిరంజీవి అభిమానులంతా ఒక గ్రూపైతే, అభిమానుల్లో నలుగురం ఒక గ్రూపుగా ఏర్పడినాం. అప్పట్లో మా బాస్ స్వ//ఎన్.ఆర్.రఘు
(చిత్తూరులో పసుపు చొక్కా వేసుకుని ,తిరిగిన మొట్ట మొదటి వ్యక్తి. కాని ఒక కులం వారు అతనిని ప్రక్కన పెడుతూ కవున్సిలర్ పదవికే పరిమితం చేసేరు. కాని సి.కె. అతన్ని పిలిచి మరి ఎం.పి.పి.గా పోటి చేయమని అవకాశం కల్పించారు. అప్పటికే అతను ఔట్ డేటడ్ అయ్యుండడం, సినిక్ గా తయారు కావడం చేత ఓడిపోయాడు)
ఆయన ఆద్వర్యంలో మేము చానక్య శపథం ఫ్యావరిట్ షోకు ప్లాన్ చేసాం . తిక్కెట్లు ముద్రించుకొని విక్రయం కూడ మొదలు పెట్టేసాం. అప్పుడు సి.కె. మునిసిపల్ వైస్.చేర్మన్ గా ఉన్నారు.
తక్కిన అభిమానులంతా సి.కె.వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన అనుకుని ఉంటే షోను మెజారిటి గ్రూపు అభిమానులకు దక్కేలా చేసి ఉండవచ్చు. ఇందాకా అమ్మిన టికెట్ల డబ్బులను సైతం రాభట్టి అసలైన అభిమానులకు ఇచ్చి ఉండవచ్చును.
కాని ఆయన మా అందరిని ఒప్పించి ఇందాకా అమ్మిన టిక్కెట్ల సొమ్ము త్యేతర్ అలంకారానికి మేమే వెచ్చించేట్లు, తక్కిన టికెట్లను అసలు cost కే కౌంటర్ లో అమ్మేలా ఏర్పాటు చేసారు.
ఒక్క సంఘఠన చాలు ఆయన ఔన్నత్యాన్ని చాటదానికి.

ఇంకో చిన్న విషయం చెబుతా చిత్తూరు తౌన్ తేన బండ అవతల మంగ సముద్రం ఉంది. సర్పంచ్ తె.దే.పా కు చెందినవారు. అక్కద మురావత్ ఆలిషా బాబా దర్గా ఉంది. చిత్తూరు ఎం.పి.ఆదికేఆవులు మంగసముద్రానికి ఒక త్రాగునీటి బోరు ఒకటి మంజూరు చేసారు.(ఎం.పి.నిదుల్లో నుండి) బోరు పాయింట్ దర్గా ఆవరనలో పడింది. దర్గా వారు బొరు వేసుకోవడానికి అనుమతించారు. పది మంది ఉపయోగపడే పని కాబట్టి. బోరు వేసారు. మోతారు బిగించారు. ఓపనింగ్ తేది దగ్గర పడింది. సర్పంచ్ దర్గా కమిటి వారివద్దకు వచ్చి ప్రస్తుతానికి దర్గా కరెంటుతో ఓపనింగ్ మాత్రం చేస్తాం. ఆతరువాత లైన్ వచ్చేస్తుందన్నారు. దర్గా వారు అందుకూ సమ్మతింఛేరు.
ఇక చూసుకొండి రోజులు నెలలయ్యై,నెలలు సంవత్సరాలయ్యాయి. లైను రాలే ,ఇంకోటి రాలే.. విదుయుత్తేమో దర్గా వారిది. బిల్లేమో వేలల్లో వస్తుంది. పేరేమో సర్పంచికి,ఎం.పి.కి. పోని బిల్లు కట్టడం మానేస్తే డిపార్ట్మెంటు వారు ఫ్యూజు పీకుతారు. అయినా సంవత్సారాలు తరబడి బిల్లులు కట్టేరు. ఆపై దర్గా వారు సి.కె.కు విన్నవించేరు. సి.కె. సతరు సర్పంచికి చెప్పేరు . చెప్పినప్పుడల్లా అతివినయం ప్రదర్శించతం. తీరా మాటలను గాలికొదిలేయడం . ఇదీ వరసా. సి.కె. సర్పంచిని తన్న లేదే.బెదిరించ లేదే. సమస్య నోట నోటా ప్రాకి నా చెవికి వస్తే నాదైన శైలిలో సమస్యను పరిష్కరించాను. ఇందుకు క్రుతజ్ఞతలు తెలుపడానికి దర్గా కమిటి వారు నాకు సాలువ కప్పడానికి సిద్దమయ్యేరు. కొందరు అత్యుత్సాహం తో సంగతి సి.కె.చెవికి చేర్చారు., ఆయన మాత్రం ఈగో ఫీల్ కాలేదే. దర్గా కమిటీ వారు నాకు సాలువ కప్పేరు. ఫొటో పత్రికల్లో సైతం వచ్చాయి.
ఆత్మ విశ్వాసం గలవాడు ఎప్పుడూ ఈర్ష్య ఫీల్ కాడు. సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం గురించి చెప్పాలంటే ఇంకా 10 బ్లాగులు పెట్టాలి సుమా !

Wednesday 16 December 2009

chiru

ఇన్ని రోజుల తర్వాత చిరంజీవి కి తిరుపతి గుర్తు వచిందా ... సిగ్గు లేని చిత్తూర్ పి.ఆర్.పి నాయకులు ... కరుణాకర్ రెడ్డి మరియు చెవి రెడ్డి రిలే తర్వాత దీక్ష చేస్తున చిరు ...

గత వారం రోజులుగా తిరుపతి లో చాలా దీక్ష లు చేస్తున్నారు...

ఇన్ని రోజులు వాటిని పటించుకోకుండా ఉన్న చిరంజీవి ఈ రోజు నేను తిరుపతి లో దీక్ష చేస్తా అనడం సిగ్గు లేని తనం...

తిరుపతి కి ఎం.ఎల్.ఎ గా ఎన్నిక చేసిన ప్రజలకు కనేసం ఒక నాయకుడిని పెట్టకుండా తిరుపతి ని పతిచించుకొని చిరంజీవి ఈ రోజు చేయడం సిగ్గు లేని తనం....

ఐన సమైక్య అందర కోసం పోరాటం కోసం మా బ్లాగ్ స్వాగతిస్తుంది...

Tuesday 15 December 2009

Rally in chittoor





"నిజమైన ఆంధ్రుడు దేహం ముక్కలు అయినా భరిస్తాడు కాని ,రాష్ట్రము ముక్కలు అయితే భరించలేడు




ప్రియమైన నా సమైఖ్యాంధ్ర సోదర సోదరిమణులారా ! మీకో చిన్న విన్నపం,
తెలంగాణా కోరుకునే నాయకులంతా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు విడదీయాలి అనుకుంటునారు? వారు చెప్పేకారణాలు ఇవే కదా?

1. తెలంగాణా ప్రాంతం లో అభివృద్ధి లేదు. కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా అభివృద్ధి అయ్యాయి.
2.
తెలంగాణా ప్రాంతం లో ఉద్యోగాలు అన్ని తెలంగాణా వాళ్ళకే చెందాలి. కోస్తా రాయసీమ వాళ్ళకు చెందకూడదు.
3. తెలంగాణా రాష్ట్రము తోనే మా ప్రజల ఆర్థిక అసమానతనాలు తొలిగిపోతాయి.
4.తెలంగాణా ని మేమే పరిపాలించుకోవాలి.

ఈ సమస్యలన్నీరాష్ట్ర విభజన తోనే తీరిపోతాయి అనుకొంటే పొరపాటే ,ఎందుకంటే

1. తెలంగాణా ప్రాంతం లో అభివృద్ధి లేదు. కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా అభివృద్ధి అయ్యాయి.
కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా అభివృద్ధి అయ్యుంటే ,ఈ రోజు Gao,Pune,Mumai వేస్యవాటికల్లో చిత్తూరు జిల్లా ఆడపడుచులు ఎక్కువ మంది ఎందుకు ఉంటారు ?ధనిక జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తిండి దొరకక ,అడవుల్లో బ్రతుకుతూ ,దుంపలు తింటున్నారు?

" ఇది వెనుక బాటు తనం కదా? పేదరికం కదా ?
ఎక్కడ లేదు పేదరికం?ఎక్కడ లేదు దారిద్యం?"

2. తెలంగాణా ప్రాంతం లో ఉద్ద్యోగాలు అన్ని తెలంగాణా వాళ్ళకే చెందాలి. కోస్తా ,రాయలసీమ వాళ్ళకి చెంధకుడదు.

ఎవరి ప్రాంతం లో వాళ్ళకే ఉద్యోగాలు చేయాలి,బయట వాళ్ళు చేయకూడదు అని ఈ Globalization time లో కూడా అనుకుంటే, Bangalore,Chennai,Pune,Mumai,Delhi లో ఉండే తెలంగాణాsoftware Engineers కూడా resign చేసి తెలంగాణా కి వచ్చేయాలి .విదేశాల్లో ఉండే మన భారతీయులంతా resign చేసి, భారతదేశాని కి వచ్చేయాలి. ఇది సాధ్యమా ?

" అలా అనుకోవటం మూర్ఖత్వం కదా ?"

3.తెలంగాణ రాష్ట్రము తోనే మా ప్రజల ఆర్ధిక అసమానతలు తొలిగిపోతాయి.

America లాంటి ప్రపంచ ధనిక దేశాల్లో కూడా రాత్రి 8 గంటలు దాటాక బలవతంగా డబ్బులు వసూలు చేస్తూ గాయ పరుస్తూ ఉన్నారే ,మరి ఇది ఆర్ధిక అసమానత వల్లే కాదా ?
పదేళ్ళుగా MLA,MP గా ఉన్నKCR కనీసం కరీంనగర్ లోని ఆర్ధిక అసమానతలు తొలగించాడ ?కనీసం ఆ దిసగా ప్రయత్నం చేస్తునాడా ?
పదేళ్ళుగా తన సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేని వారు రేపు తెలంగాణా ని ఎలా అభివృద్ధి చేస్తాడు అని ఎలా అనుకుంటున్నారు ?

4. తెలంగాణా ని మేమే పరిపాలించాలి.

నాయకుడు ఎప్పుడు ప్రాంతాన్ని బట్టి తయారవుతాడు. స్వాతంత్ర్యం తరువాత గత 60 ఏళ్ళలో ధక్షణ భారతీయులు 6 ఏళ్ళు మాత్రమే ప్రధానమంత్రి గా పనిచేసారు.ఇలా ఆలోచిస్తే ,మనలని మనమే పరిపలించుకోవాలి అనుకుని , ధక్షణ భారతదేశాన్ని భారతదేశం నుంచి విడిపోయి ,ఒక దేశం గా మార్చాలి అనుకోవటం సమంజసమా ?

"ఇది ఎంత నీచపు ఆలోచనో అర్ధం చేసుకోండి?"

ప్రతిదేశం లోనూ, ప్రతి ప్రాంతం లోనూ ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఉంటాయి.KCR,Raj Thakare లాంటి నాయకులూ వీటిని భూతద్దం లో చూపి,అమాయక ప్రజలని రెచ్చ గొడుతూ పబ్బం గడుపుతున్నారు. ఇలాంటివాళ్ళ వల్ల లాభం అస్సలు లేక పోగా ,నష్టమే ఎక్కువ.ఎలా అంటే మొన్న జరిగిన ఉద్ద్యమం లో,అమాయకపు విద్యార్థులు చనిపోయారే తప్ప ,నాయకుల కొడుకులు కానీ ,కుమార్తెలు కాని,కనీసం నాయకుల బంధువుల పిల్లలు కాని చనిపోయారా ? కొట్టుకుని చనిపోయేది మనం ,రెచ్చ కొట్టేది వాళ్ళు .చనిపోయిన వల్ల తల్లుల గుండె కోత ఎవరు చూస్తారు?

" కలిసి ఉంటే కలదు సుఖం" అనేది ఇప్పుడు,ఎప్పుడు ,ఇంకెప్పుడూ నిజమే. విడకోట్టటం చాలా సులువు,నిర్మించటం చాలా కష్టం . KCR ఎప్పుడు మనలని విడతీయాలని చూస్తున్నాడే తప్ప ,కలిసి ఉండేందుకు ఎమీ చేయలేదు. మీకు చెప్పేది ఒక్కటే .
"నిజమైన ఆంధ్రుడు దేహం ముక్కలు అయినా భరిస్తాడు కాని ,రాష్ట్రము ముక్కలు అయితే భరించలేడు "

Your feedback is always welcome to "samykhyandhra@gmail.com"


from
Dinesh Reddy.T.K


Friday 11 December 2009

సమైక్య ఆంధ్రప్రదేశ్---సి.కె.బాబు----రాజీనామా---- ఎం.ఎల్.ఏ పదవి పెద్ద లెక్క కాదు




నిన్న సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశమైన రాయలసీమ శాసన సభ్యులు సమైక్య ఆంధ్ర కోరుతూ తమ పదవులకు రాజీనామా చేసారు . తర్వాత కమిటీ హాల్ లో సమావేశ మైన కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లు తమ పదవులకు రాజీనామా చేసారు. అందులో మన చిత్తూర్ ఎం.ఎల్.ఏ సి.కె.బాబు గారు కూడా రాజీనామా చేసారు.


ఆయన న్యూస్ లైన్ తో ఇలా చెప్పారు " సమైక్య ఆంధ్రప్రదేశ్ " మా ప్రధాన డిమాండ్ . రాష్ట్రం ముక్కలు చేయాలి అని చూస్తే తిరుపతి రాజధానిగా ' గ్రేటర్ రాయలసీమ ' ఇవవలసిందే. అదే విధంగా ప్రత్యేక పక్యేజి ని కూడా ప్రకటించాలి . ఎం.ఎల్.ఏ పదవి పెద్ద లెక్క కాదు, అందుకే రాజీనామా చేశాను చెప్పారు.

సి.కె.బాబు మాత్రమే కాదు ప్రతి ఒకరు సమైక్యత ఆంధ్ర గా నే ఉండాలి అని ఆశాభావం చెప్పారు. సి.కె.బాబు గారి ఆధ్వర్యం లో పటణం లో ధర్నా నిర్వహించారు.
చిత్తూర్ పట్టాన కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివ , మునిసిపల్ చైర్మన్ సరళ మేరి , vice చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్త లు పెద్ద సంక్యలో పాల్గొనారు. ప్రతి కళశాల విద్యార్థులు పాల్గొనారు.

న్యూస్- చిత్తూర్- దినేష్ రెడ్డి................

www.ckforchittoor.blogspot.com