Sunday 20 December 2009

సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం


ఇటీవల హేట్రిక్ ఎ౦.ఎల్.. , చిత్తూరు టైగర్, ప్రజా నాయకులు సి.కె.బాబు గారి అభిమానులు కొందరు 2007,డెసెంబర్ ,31 సి.కె.పై జరిగిన బ్లాస్ట్ నేపథ్యంలో నాలుగు ముక్కలు వ్రాయమన్నారు . అందులో దగ్గర పడుతూంది మా నాయకుడు కిరీటం దరించే రోజని ఒక ముక్క తమిళ వెర్షన్ లో వచ్చి పడింది . అది వ్రాసిన దినం డిసెంబర్ 30. జనవరి 1 సాయంత్రమే సి.కె.బాబుకు రాయలసీమ అభివౄద్ది మండలి చేర్మన్ పోస్టు ఖాయమైనట్లు వార్తా పత్రికల్లో కథనాలు వెలుబడ్డాయి ను రాయల సీమ అభ్వృద్ది మండలి చేర్మన్ పదవి వరించనుంది. సంచిక వెలుబడే లోపె ఉత్తర్వులు జారి అయ్యుండవచ్చు.

సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం

నాకు సంవత్సరం సరిగ్గా గుర్తులేదు కాని చిరంజీవి నటించిన చానక్య శపథం సినిమా రిలీజైన రోజది.
చిరంజీవి అభిమానులంతా ఒక గ్రూపైతే, అభిమానుల్లో నలుగురం ఒక గ్రూపుగా ఏర్పడినాం. అప్పట్లో మా బాస్ స్వ//ఎన్.ఆర్.రఘు
(చిత్తూరులో పసుపు చొక్కా వేసుకుని ,తిరిగిన మొట్ట మొదటి వ్యక్తి. కాని ఒక కులం వారు అతనిని ప్రక్కన పెడుతూ కవున్సిలర్ పదవికే పరిమితం చేసేరు. కాని సి.కె. అతన్ని పిలిచి మరి ఎం.పి.పి.గా పోటి చేయమని అవకాశం కల్పించారు. అప్పటికే అతను ఔట్ డేటడ్ అయ్యుండడం, సినిక్ గా తయారు కావడం చేత ఓడిపోయాడు)
ఆయన ఆద్వర్యంలో మేము చానక్య శపథం ఫ్యావరిట్ షోకు ప్లాన్ చేసాం . తిక్కెట్లు ముద్రించుకొని విక్రయం కూడ మొదలు పెట్టేసాం. అప్పుడు సి.కె. మునిసిపల్ వైస్.చేర్మన్ గా ఉన్నారు.
తక్కిన అభిమానులంతా సి.కె.వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన అనుకుని ఉంటే షోను మెజారిటి గ్రూపు అభిమానులకు దక్కేలా చేసి ఉండవచ్చు. ఇందాకా అమ్మిన టికెట్ల డబ్బులను సైతం రాభట్టి అసలైన అభిమానులకు ఇచ్చి ఉండవచ్చును.
కాని ఆయన మా అందరిని ఒప్పించి ఇందాకా అమ్మిన టిక్కెట్ల సొమ్ము త్యేతర్ అలంకారానికి మేమే వెచ్చించేట్లు, తక్కిన టికెట్లను అసలు cost కే కౌంటర్ లో అమ్మేలా ఏర్పాటు చేసారు.
ఒక్క సంఘఠన చాలు ఆయన ఔన్నత్యాన్ని చాటదానికి.

ఇంకో చిన్న విషయం చెబుతా చిత్తూరు తౌన్ తేన బండ అవతల మంగ సముద్రం ఉంది. సర్పంచ్ తె.దే.పా కు చెందినవారు. అక్కద మురావత్ ఆలిషా బాబా దర్గా ఉంది. చిత్తూరు ఎం.పి.ఆదికేఆవులు మంగసముద్రానికి ఒక త్రాగునీటి బోరు ఒకటి మంజూరు చేసారు.(ఎం.పి.నిదుల్లో నుండి) బోరు పాయింట్ దర్గా ఆవరనలో పడింది. దర్గా వారు బొరు వేసుకోవడానికి అనుమతించారు. పది మంది ఉపయోగపడే పని కాబట్టి. బోరు వేసారు. మోతారు బిగించారు. ఓపనింగ్ తేది దగ్గర పడింది. సర్పంచ్ దర్గా కమిటి వారివద్దకు వచ్చి ప్రస్తుతానికి దర్గా కరెంటుతో ఓపనింగ్ మాత్రం చేస్తాం. ఆతరువాత లైన్ వచ్చేస్తుందన్నారు. దర్గా వారు అందుకూ సమ్మతింఛేరు.
ఇక చూసుకొండి రోజులు నెలలయ్యై,నెలలు సంవత్సరాలయ్యాయి. లైను రాలే ,ఇంకోటి రాలే.. విదుయుత్తేమో దర్గా వారిది. బిల్లేమో వేలల్లో వస్తుంది. పేరేమో సర్పంచికి,ఎం.పి.కి. పోని బిల్లు కట్టడం మానేస్తే డిపార్ట్మెంటు వారు ఫ్యూజు పీకుతారు. అయినా సంవత్సారాలు తరబడి బిల్లులు కట్టేరు. ఆపై దర్గా వారు సి.కె.కు విన్నవించేరు. సి.కె. సతరు సర్పంచికి చెప్పేరు . చెప్పినప్పుడల్లా అతివినయం ప్రదర్శించతం. తీరా మాటలను గాలికొదిలేయడం . ఇదీ వరసా. సి.కె. సర్పంచిని తన్న లేదే.బెదిరించ లేదే. సమస్య నోట నోటా ప్రాకి నా చెవికి వస్తే నాదైన శైలిలో సమస్యను పరిష్కరించాను. ఇందుకు క్రుతజ్ఞతలు తెలుపడానికి దర్గా కమిటి వారు నాకు సాలువ కప్పడానికి సిద్దమయ్యేరు. కొందరు అత్యుత్సాహం తో సంగతి సి.కె.చెవికి చేర్చారు., ఆయన మాత్రం ఈగో ఫీల్ కాలేదే. దర్గా కమిటీ వారు నాకు సాలువ కప్పేరు. ఫొటో పత్రికల్లో సైతం వచ్చాయి.
ఆత్మ విశ్వాసం గలవాడు ఎప్పుడూ ఈర్ష్య ఫీల్ కాడు. సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం గురించి చెప్పాలంటే ఇంకా 10 బ్లాగులు పెట్టాలి సుమా !

No comments:

Post a Comment